పెద్దపల్లి : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పెద్దపల్లి నియోజకవర్గంలోని పాలితంలో పాదయాత్ర ప్రవేశించగానే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతం పలికే క్రమంలో కార్యకర్తలు బాహా బాహీకి దిగారు. మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో మొదట భట్టికి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఓదెల జడ్పీటీసీ గంట రాములు కొంతమంది అనుచరులతో అక్కడికి చేరుకోగానే ఇరువర్గాల కార్యకర్తల నినాదాలు హోరెత్తించారు. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు ఒకరిని ఒకరు తోసుకోవడంతో తోపులాట జరిగి గలాట నెలకొంది. దీంతో భట్టి సెక్యురిటీ సిబ్బంది తోపులాడుతున్న కార్యకర్తలను ఒక్కసారిగా చెదరగొట్టారు.