కోరుట్ల రూరల్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రైతు బంధువు అని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. మండలంలోని సంగం నాగులపేట గ్రామాల్లో కళ్యాణ లక్ష్మి రైతుబంధు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టిందని పేర్కొన్నారు. రైతు కుటుంబంలో కుటుంబ యజమాని మరణిస్తే ఆ కుటుంబాన్ని అరికెనేందుకే కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు .ఈ పథకం ద్వారా ఇప్పటికే ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందాయని అన్నారు. రైతు మృతి చెందిన 20 రోజుల్లోనే లబ్ధిదారుల ఖాతాలో డబ్బు జమవుతుందని పేర్కొన్నారు.
అనంతరం ఆయా గ్రామాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. సంఘం గ్రామంలోని సంగమేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే పూజా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట నారాయణ, జిల్లా రైతుబంధు అద్యక్షులు చీటీ వెంకటరావు, సర్పంచుల పురం జిల్లా గౌరవ అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, మండల వ్యవసాయ అధికారి నాగమణి ,ఏఈఓ నరేష్, సర్పంచులు చెప్పాల్లాల్. నరసయ్య కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉమేష్, వీఆర్వో భాస్కర్ ,రైతుబంధు గ్రామ శాఖ అధ్యక్షులు సుధా వేణి భూమయ్య నారాయణరెడ్డి ఉప సర్పంచ్ సాగరిక శంకర్ పాలూరు వార్డు సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు