Friday, November 22, 2024

రైతు సంక్షే మ‌మే ప్ర‌భుత్వ ధ్యేయం

రైతు సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని పెద్ద‌ప‌ల్లి ఎమ్మెల్యే దాస‌రి మ‌నోహ‌ర్ రెడ్డి అన్నారు.పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామంలో పిఏసీస్ ద్వారా ఏర్పాటు చేసిన వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయ‌న ప్రారంభించి మాట్లాడారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుంద‌న్నారు

కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయమని ఢిల్లీలో చెబుతుంటే రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ నాయకులు ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి రైతులను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన తెరాస పోరాటం కొనసాగిస్తుందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కాని రైతు సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయని, రైతు బంధు ద్వారా ఏడాదికి ఎకరానికి రూ. 10వేలు ముందస్తు పంట పెట్టుబడి అందిస్తున్నామన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు ఎందుకు అమలు చేయడం లేదో ఆ పార్టీ నాయకులు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారిస్రవంతి-శ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, ఛర్మ‌న్ మాదిరెడ్డి నరసింహా రెడ్డి,వైస్ ఎంపీపీ రాజయ్య, గ్రామ సర్పంచ్ జయప్రద-సంజీవరెడ్డి, ఉప సర్పంచ్ ఈదునూరి జాన్,మాజీ సర్పంచ్ వెంకటి, డైరెక్టర్ జైపాల్,గ్రామ శాఖ అధ్యక్షుడు, అధ్యక్షుడు కిషన్ రెడ్డి,గ్రామ పాలకవర్గం,తెరాస నాయకులు సల్లు, నర్సింగ్,మల్లేశం,యూసఫ్,తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement