ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సీఎంఆర్ గడువు పెంపు విషయంలో చేసిన కృషి ఫలించింది. 2021-22 వానాకాలం బియ్యాన్ని సమర్పించేందుకు ఈ నవంబర్ 30 వరకు భారత ఆహార సం(ఎఫ్‌సీఐ) గడువును పెంచిందని మంత్రి పేర్కొన్నారు. నిరంతరం రాష్ట్ర రైతాంగం గురించి తపించే ప్రభుత్వ యంత్రాంగం రైతులకు లబ్ధి చేకూర్చేందుకు అనుక్షణం తపిస్తూనే ఉంటు-ందన్నారు.అందుకు నిదర్శనంగా రైతుకు అనుకూల నిర్ణయాల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. దీంతోపాటు గత యాసంగి బియ్యం బాయిల్డ్ గా తీసుకునేందుకు మరో నాలుగు లక్షల టన్నులకు అనుమతించిందని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన ఎనిమిది లక్షలు టన్నులతో కలిసి మొత్తం 12 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ సేకరణకు మార్గం సుగమమైందన్నారు. తద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు 180 కోట్లు ఆదా అవుతాయని మంత్రి పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement