పెద్దపల్లి పట్టణ అభివృద్ధి కోసం 25 కోట్ల రూపాయలు మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జండా చౌరస్తాలో మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు కేసీఆర్ చేపడానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ… పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనుల కోసం టి యు ఎఫ్ ఐ డి సి ద్వారా ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు.
త్వరలోనే పనులు ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. పెద్దపల్లి పట్టణాభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలకు పట్టణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని, ఇతర అభివృద్ధి పనులు చేపట్టమన్నారు. పెద్దపల్లి పట్టణ ప్రజలు భారత రాష్ట్ర సమితికి అండగా ఉండాలని, రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండాకు మద్దతివాలన్నారు. అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు జడల సురేందర్, పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, పట్టణ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.