మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు, సికాస వ్యవస్థాపక కమిటీ సభ్యుడు మహమ్మద్ హుస్సేన్ రియాజ్ అలియాస్ సుధాకర్, రమాకాంత్ ను తెల్లవారు జామున జమ్మికుంటలోని ఆయన నివాసంలో మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆయనపై రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు పెండింగ్ లో ఉండడంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
30సంవత్సరాలు సుదీర్ఘంగా ఉద్యమంలో పనిచేసిన రమాకాంత్ ను గతంలో జార్ఖండ్ రాష్ట్రంలో అరెస్ట్ చేసిన అనంతరం 12సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించారు. అనారోగ్య కారణాలతో బెయిల్ పై విడుదలయ్యారు. 10సంవత్సరాలుగా జమ్మికుంటలో సాధారణ జీవితం గడుపుతుండగా పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది.
- Advertisement -