Tuesday, November 5, 2024

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పెద్దపెల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ పిలుపునిచ్చారు. శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండం లో ఓటు వినియోగం పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 5కే రన్ ను ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అవకాశం కల్పించిందని దాన్ని సక్రమ పద్ధతిలో వినియోగించుకోవాలి అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం జిల్లాలో పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. 5కే రన్ లో ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement