కరీంనగర్, : కులం.. పార్టీ.. డబ్బు.. జెండా కాదు..మనిషిని గుర్తుపె ట్టుకోండి నేను గాయపడుతుం డొచ్చు..కానీ మనస్సు మార్చుకోలేదు. కళ్యాణలక్ష్మీ, పెన్షన్లు పేదరికానికి పరిష్కారం కాదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పరిగ ఎరుకుంటే రాదు పంట పండితే వస్తుంది అనే సామెత ఉంది అలాగే కళ్యాణ లక్ష్మీ, పెన్షన్, రేషన్ కార్డ్ లు పేదరికానికి పరిష్కారం కాదు.. తన కాళ్ళమీద తాను నిలబడే సత్తా తీసుకురావాలి. నేను చేవ ఉన్న దాన్ని, సాహసం ఉన్నవాడిని, నేను పని చేయగలననే కాన్ఫిడెన్స్ రావాలన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజక వర్గం వీణవంక మండలం రైతు వేదికలను రైతులకు అంకితం చేసిన సందర్భంగా మాట్లాడిన ఈటెల రాజేందర్ ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడి పోవచ్చు కానీ అంతిమ విజయం వాటివే.. కులం, డబ్బు, పార్టీ, జెండా కాదు మనిషి ని గుర్తుపెట్టుకోండి. నా లాంటి వాడు కూడా మళ్ళీ మీ ముందుకు వచ్చి దేహి అనే పరిస్థితి మంచిది కాదు అంటూ వ్యాఖ్యా నించారు. నేను గాయపడుతుండచ్చు గాక, నేను మనసును మార్చుకోలేదు. పెట్టిన చెయ్యి ఆగదు. చేసే మనిషిని నేను ఆగను. నేను ఉన్నంతవరకు 20 ఏళ్ల ప్రస్థానంలో నన్ను గొప్పగా ఎంత ఎత్తుకు ఎత్తారో నాకు తెలుసు.తప్పకుండా నేను ఉన్నంతవర కు మావాళ్లు ఉన్నంతవరకు మీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను”. అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement