Friday, November 22, 2024

సామాన్య ప్రజలపై భారం మోపొద్దు..

పెద్దపల్లిరూరల్‌: కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ప్రభుత్వం మరింత భారం మోపేలా వ్యవహరించడం అన్యాయమని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరోనా కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం నిత్యావసర సరుకులతోపాటు వేసవికాలం పూట అదను చూసి కరెంటు బిల్లులు పెంచుతూ పేద ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు రూ. 2వేలు, 25 కిలోల బియ్యం ఇస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం మోపడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డెవలప్‌మెంట్‌ ఛార్జీల పేరిట వసూలు చేస్తున్న కరెంటు బిల్లుల తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కరోనా కాలంలో ప్రజలను ఆదుకునే చర్యలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కల్వల శ్రీనివాస్‌, భూషణవేణి సురేష్‌గౌడ్‌, నేత్తెట్ల కుమార్‌, ఎస్పీ రాజయ్యగౌడ్‌, వేముల రాజు, విజయ్‌కుమార్‌, కట్కూరి సందీప్‌, వెంకట్‌, యుగంధర్‌ తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement