మొక్కల పెంపకంతోని పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పెద్దపెల్లి సిఐ అనిల్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న హరితోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ విధిగా ఐదు మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. రోజురోజుకు పర్యావరణం కలుషితమవుతుందని పెద్ద ఎత్తున మొక్కలు పెంచడం ద్వారానే కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎస్ఐ మహేందర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement