రామగిరి: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమైందని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ, వెజ్‌బోర్డు సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య, సీనియర్ నాయకులు శేషయ్య మండిపడ్డారు. మండలంలోని సెంటినరీకాలనీ ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులపై పనిభారం పెరుగుతోందని, పని చేసే స్థలంలో నలుగురు అవసరం ఉండగా ఒక్కరితోనే పని చేయించడం శ్రమను దోచుకోవడమేనన్నారు. దీనిపై గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కార్మికులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా కార్మిక సమస్యలపై పోరాటం చేయాలని, కార్మికుల పక్షాన ఏఐటీయూసీ ఉద్యమిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో ఆర్జీ3 బ్రాంచి కార్యదర్శి జూపాక రామచంద్రం, డిప్యూటి జనరల్ సెక్రటరీలు బాజీ సైదా, వైవీ రావు, ఉపాధ్యక్షుడు సమ్మయ్య, అసిస్టెంట్ సెక్రటరీ పోశం, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంఆర్‌సీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement