Friday, November 22, 2024

కార్మికుల సమస్యలు..

రామగిరి: ఆర్జీ3 ఏరియా ఓసీపీ2లో సింగరేణి కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌సీఎంఎల్‌యు-ఐఎన్‌టీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు కోట రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎస్‌, డీ సెక్షన్‌లో 120 మంది వరకు మ్యన్‌ పవర్‌ ఉందని, వారికి కనీస వసతులు కల్పించడంలో విఫలం చెందారని ఆరోపించారు. ఎస్‌ఎంఈ సెక్షన్‌ మూత్రశాలలకు దూరంగా ఉందని, డంపర్‌ సెక్షన్‌లో రెస్ట్‌ షెల్టర్‌ పైకప్పు పూర్తిగా చెడిపోయి వర్షం పడితే కూర్చునే పరిస్థితి లేదన్నారు. కార్మికులు ఆహ్లాదకరంగా, అలసట లేకుండా పని చేసేందుకు తొలగించిన ఎఫ్‌ఎం రేయోడిలను వెంటనే బిగించాలన్నారు. ఇప్పటికైనా స్పందించి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈకార్యక్రమంలో సం ఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement