Tuesday, November 26, 2024

KNR: సీఎం దిష్టిబొమ్మ దహనం.. బీఆర్ఎస్ నాయకుల అరెస్టు

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసనకు దిగిన బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అనంతరం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ మాట్లాడుతూ… భారతదేశంలో ఎంతో గౌరవించే ఆడబిడ్డలను నిండు అసెంబ్లీలో అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్కలు
భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆడబిడ్డలను అవమానించిన వారికి వారి ఉసురు తప్పకుండా తాకుతుందని, క్షమాపణ చెప్పే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన త‌మ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement