Saturday, November 30, 2024

Sirisilla | అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి.. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

సిరిసిల్ల, నవంబర్‌ 30 (ఆంధ్రప్రభ): పోలీస్‌ శాఖలో అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. శనివారం తొమ్మిది నెలల శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకొని జిల్లాకు చేరుకున్న 125 (సివిల్‌, ఆర్ముడ్‌ రిజర్వు, కమ్యూనికేషన్) కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పోలీస్‌ కార్యాలయం నందు గల కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లాకు చేరుకున్న నూతన సివిల్‌ ఆర్ముడ్‌ రిజర్వ్‌ కానిస్టేబుల్‌ తో సమావేశం నిర్వహించి విధులపై దిశ నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు శాఖలో పూర్తి నిబద్ధతతో, అంకితభావంతో, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ పోలీస్‌ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. పోలీస్‌ శాఖ అనుసరిస్తున్న సాంకేతక పరిజ్ఞానం అందిపుచ్చుకోవలన్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని నిలబడవచ్చన్నారు. తొమ్మిది నెలల శిక్షణలో నేర్చుకున్న నూతన చట్టాలపై నిరంతరం పటనం చేస్తూ అన్ని చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని, విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం చూపిన, శాఖ పరమైన చార్యలుంటాయన్నారు.

- Advertisement -

విజిబుల్‌ పొలిసింగ్ లో భాగంగా అమలు చేస్తున్న విలేజ్‌ పోలీసింగ్‌లో భాగంగా తమకు కేటాయించిన గ్రామాలపై పట్టు సాధించాలని, పోలీస్‌ శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫంక్షనల్‌ వర్టీకల్స్‌ పై పూర్తి అవగాహన కలిగి ఉంటూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఆర్ముడ్‌ రిజర్వ్‌ సిబ్బంది నాకబంది, పికెట్స్‌, విఐపి బందోబస్త్‌ డ్యూటీస్‌, వివిధ బందోబస్త్‌ డ్యూటీలలో, ప్రిసనర్‌, క్యాష్‌ ఎస్కార్డ్స్‌, లా అండ్‌ ఆర్డర్‌ విధులలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్‌ఐలు రమేష్‌, మధుకర్‌, ఆర్‌ఎస్‌ఐ శ్రవణ్‌ యాదవ్‌, కమ్యూనికేషన్‌ సిఐ శ్రీలత, నూతన కానిస్టేబుల్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement