ఎన్‌టీపీసీ: భారతీయ రిజర్వు బ్యాంకు ఏర్పాటుకు మూల కారకుడైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోను భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని సమతా ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ డిమాండ్ చేశారు. ఎన్టీపీసీలో సమతా ఫౌండేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బాబా సాహెబ్ అంబేద్కర్ కృషితో 1935 ఏప్రిల్ 1న భారతీయ రిజర్వ్ బ్యాంకు స్థాపించారన్నారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ పాలనలో దేశం ఆర్థిక సంక్షోభానికి గురైందని, దాని నుంచి బయటపడేందుకు ఇంపీరియల్ బ్యాంక్ 1921ను ఏర్పాటు- చేసినప్పటికీ అది విఫల ప్రయత్నంగానే మిగిలిపోయిందన్నారు. అయితే ఆ సమయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ క్షీణిస్తున్న రూపాయి విలువ, దాని వల్ల సామాన్యుడి జీవనం ఎలా దుర్భరమవుతుందో, ఆర్థికంగా దేశం ఎలా పతనమవుతుందో బ్రిటీ-ష్ వాళ్లకు తెలియజేసి, పోరాటం చేసి సఫలీకృతులయ్యారన్నారు. ఈకార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు దుర్గం శ్రీనివాస్, మంచినీళ్ల లింగన్న, ముడిమడుగుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement