ముత్తారం: మండలంలోని నాయకులు, కార్యకర్తలు ఎలాంటి మనస్ఫర్తలు లేకుండా ఐకమత్యంగా మెలగాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. రాజీనామాల నేపథ్యంలో మండల కాంగ్రెస్ నాయకులతో హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఆయన సూచనలతో నాయకులు, కార్యకర్తలు శాంతించి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. మొదటగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బియ్యని శివకుమార్, ఆ తర్వాత ముత్తారం సర్పంచ్ తూటి రజిత రఫి, వార్డుసభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే సమావేశమై సూచనలు చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య, మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు వాజిద్ పాషా, సీనియర్ నాయకులు బక్కతట్ల కుమార్, దాసరి చంద్రమౌళితోపాటు యూత్ కాంగ్రెస్ నాయకులు బియ్యని రాజబాబు, నాయకులు, ముత్తారం వార్డు సభ్యులు మల్యాల లక్ష్మి, అనంతుల రజిత, రాజేందర్, చీకట్లో రాధా, గుడి రాములు, మాజీ వార్డు సభ్యులు అనుము రామస్వామి, గ్రామ శాఖ అధ్యక్షులు అనుము సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అనుము గోపి, యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు హనుమ లక్ష్మణ్, నాయకులు జక్కుల రమేష్, మల్లెల బాలు, గుడి లింగయ్య, అమ్మ రవి, అమ్మ వెంకటస్వామి, తాడవేనా మహేందర్, ఆల్బం సంపత్, వెలమరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అనుపు ప్రశాంత్, కుక్కల చందు, సారయ్యలు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement