Saturday, December 21, 2024

KNR | డ్రైనేజీ నిర్మించాలని.. వినూత్న నిరసన

మురుగు కాలువలో నిలుచుకున్న కౌన్సిలర్‌


పెద్దపల్లి, డిసెంబర్‌ 21 (ఆంధ్రప్రభ): డ్రైనేజీ నిర్మించకుండానే బీటీ రోడ్డు వేశారని ఓ కౌన్సిలర్‌ వినూత్న నిరసనకు దిగాడు. శనివారం పెద్దపల్లి మున్సిపల్‌ 12వ వార్డు కౌన్సిలర్‌ నాంసాని సరేష్‌ బాబు వినూత్న రీతిలో మురుగు కాలువలో దిగి నిరసన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు కట్ట పక్కన నూతనంగా వేస్తున్న బీటీ రోడ్డు వెంట డ్రైనేజీ నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

ఎల్లమ్మ చెరువు కట్ట రోడ్డు, డ్రైనేజీ కోసం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి కోటి రూపాయలు మంజూరు చేయించారని, ఈ నిధులతో బీటీ రోడ్డు నిర్మించి, డ్రైనేజీ నిర్మించకుండానే చేతులెత్తేసే ప్రయత్నం చేస్తున్నారని సరేష్‌ బాబు ఆరోపించాడు. అధికారులు వచ్చి హామీ ఇచ్చేంతవరకు మురుగు కాలువ నుండి బయటికి రానని స్పష్టం చేయడం గమనార్హం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement