Saturday, November 23, 2024

ఆందోళన వద్దు.. అండగా ఉంటాం : ఎమ్మెల్యే దాసరి

భారీ వర్షాల వల్ల ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని రంగంపల్లి వద్ద సాయి గార్డెన్స్ లో వరద నీటిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిక్కుకోవడంతో వారితో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. ఆందోళన చెందకండి అండగా ఉంటాం కొద్దిసేపట్లో ఫంక్షన్ హాల్ నుండి సురక్షితంగా బయటకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వెంటనే గజ ఈతగాళ్ల తో కుటుంబంలోని నలుగురిని బయటకు తీసుకెళ్లి వచ్చేందుకు చర్యలు ప్రారంభించారు. భారీ వర్షాల వల్ల రహదారులన్నీ జలవిగ్బంధమయ్యాయని ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దన్నారు. వాహనదారులు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని లేకపోతే ప్రమాదారుల బారిన పడాల్సి వస్తుందన్నారు .

ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునెందుకు ప్రభుత్వము సిద్ధంగా ఉందని పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులు 24 గంటల పాటు శ్రమిస్తున్నారన్నారు. రక్షణ చర్యల్లో పెద్దపల్లి ఏసిపి సారంగపాణి, సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ఎస్సైలు రాజేష్ వెంకటకృష్ణ తో పాటు పెద్ద సంఖ్యలో సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement