సుల్తానాబాద్ : ఇటుక బట్టీల్లో పని చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులను యజమానులు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని పెద్దపల్లి డీసీపీ రూపేశ్ పేర్కొన్నారు. శనివారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇటు-క బట్టి యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ వలస కార్మికులు బతుకుదెరువు కోసం వివిధ రాష్ట్రాల నుండి ఇటు-క బట్టీ-ల్లో పనిచేసేందుకు వచ్చారని, వారికి ఇబ్బంది కలగకుండా బట్టల వద్ద కనీస సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం కార్మికుల పిల్లలకు చదువులు నేర్పించాలని, మైనర్లతో పనులు చేయించడం చట్టరీత్యా నేరమన్నారు. ఇటుక బట్టీల ఆవరణలొనే విద్యార్థులకు ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను నియమించి విద్యా బోధన చేయించాలన్నారు. అలాగే మహిళలపై ఎలాంటి వేధింపులకు పాల్పడినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటుక బట్టీలలో పని చేసే కార్మికుల ఆధార్ కార్డులతో కూడిన వివరాలు పోలీస్‌స్టేషన్‌లో అందించాలని, ఎలాంటి గొడవలు జరిగినా, అనుకోని సంఘటనలు జరిగినా సమాచారం అందించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పెద్దపెల్లి ఏసిపి సారంగపాణి, సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐలు ఉపేందర్‌రావు, వినీత, బట్టిల యజమానులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement