కాల్వశ్రీరాంపూర్ : భారీ వర్షాలతో ఇళ్లు, పంట పొలాలు దెబ్బతిన్న బాధితులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలో ఇటీ-వల కురిసిన వర్షాలకు నష్టపోయిన ఇళ్లను, పంట పొలాలను సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. జాఫర్ ఖాన్పేట గ్రామంలో మధ్యెలవాగు కట్ట తెగి పది ఎకరాల్లో ఇసుక మేటలు వేయడంతోపాటు వెన్నంపల్లి నుంచి జాఫర్‌ఖాన్‌పేట గ్రామానికి వచ్చే రహదారి వరద ధాటికి తెగిపోయి రోడ్డుపై బుంగ ఏర్పడగా ఎమ్మెల్యే పరిశీలించారు. అలాగే పంట పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులను గుర్తించి నివేదిక అందించాని సంబంధిత వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని హుస్సేన్‌మియా వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ వరద దాటికి తెగిపోగా వాగు పరివాహ ప్రాంతంలో ఉన్న పొలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుసిన భారీ వర్షాలకు కాల్వశ్రీరాంపుర్ మండలంలోని హుస్సేన్‌మియా వాగు పరివాహ ప్రాంత రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఇరిగేషన్, ఆర్అండ్బీ, రెవెన్యూ అధికారులతో జరిగిన నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందించాలని సూచించారు. రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. గ్రామాల్లో వర్షాలతో కూలిపోయిన ఇళ్ల వివరాల సేకరణకై రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారన్నారు. వర్షాలు దాటికి కరెంట్ పోల్స్ విరిగిపోయి ఇబ్బంది ఏర్పడిందని, విరిగిన కరెంటు పోల్స్, లైన్లను సరిచేయాలని విద్యుత్ అధికారులకు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జడ్పీటీ-సీ వంగల తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు చదువు రామచంద్రారెడ్డి, గజవెల్లి పురుషోత్తం, మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టే సుజాత రవీందర్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజకొమురయ్య, సర్పంచ్‌లు ఆడెపు శ్రీదేవి రాజు, దొమ్మటి శ్రీనివాస్, బుర్ర మంగ సదానందం, ఎంపీటీసీ మాదాసు సువర్ణ రామచంద్రం, ఉప సర్పంచ్ కరుణాకర్‌రావు, ఏవో నాగార్జున, ఏఈఓలు రమేష్, పూర్ణచందర్, రాజు, శ్రీనివాస రెడ్డి, ధూపం సంపత్ కుమార్, నవీన్, సదానందం, కరుణాకర్, రాజేంద్రప్రసాద్, సారంగపాణి, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.