Monday, November 18, 2024

చిన్నారులతో వెట్టి చాకిరొద్దు… పెద్దపల్లి డిసిపి రూపేష్

ఇటుక బట్టీల్లో చిన్నారులతో వెట్టిచాకిరీ చేయించొద్దని పెద్దపల్లి డిసిపి చెన్నూరి రూపేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇటుక బట్టి యజమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ… వలస కార్మికులు పొట్ట చేత పట్టుకొని బతుకుదెరువు కోసం వివిధ రాష్ట్రాల నుండి ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు వచ్చారన్నారు. నిబంధన ప్రకారం వారి పిల్లలకు విద్యాభ్యాసం కల్పించాల్సిన బాధ్యత యజమానులపైనే ఉందన్నారు. ఇటీవల ఇటుక బట్టీలు సందర్శించినప్పుడు చిన్నారులు పనిచేస్తూ కన్పించారన్నారు.

మైనర్లతో పనులు చేయించడం చట్టరీత్యా నేరమన్నారు. ఇటుక బట్టీల ఆవరణలోనే విద్యార్థులకు క్లాస్ రూములు ఏర్పాటు చేసి టీచర్లను ఏర్పాటు చేయాలన్నారు. వలస కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, ఎట్టి పరిస్థిలో ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. కార్మికులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో పెద్దపెల్లి ఏసిపి సారంగపాణి, సిఐ ప్రదీప్ కుమార్, ఎస్సైలు రాజేష్, శ్రీనివాస్, సహదేవ సింగ్ తోపాటు ఇటక బట్టి యజమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement