కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్య ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని, పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు తెలిపారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే పోలీసులకు లేదా డయల్ 100కి ఫోన్ చేసి సహాయం పొందగలరని తెలిపారు. అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాల్సింది విజ్ఞప్తి చేశారు.
రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని సీపీ సూచించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రజల భద్రత ప్రాణా రక్షణ ను దృష్టిలో పెట్టుకొని డ్యామ్స్ పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేయడం జరిగిందన్నారు. సాధారణ పరిస్థితి వచ్చే వరకు అక్కడికి ఎవరు వెళ్లకూడదని సూచించారు.