Saturday, November 23, 2024

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు .. పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి

ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పిలుపునిచ్చారు. గురువారం రామగుండం, గోదావరిఖని లో ముంపుకు గురైన ప్రాంతాలతోపాటు నేల కూలిన గృహాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయన్నారు. నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని శాఖల అధికారులు పనిచేస్తున్నారన్నారు.

రైతులు తమ పొలాల వద్ద స్టార్టర్లు నీటిలో ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లను, విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాలనీలో భారీగా వరద నీరు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థతులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement