ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం, SRRS ఫైర్ వర్క్స్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఇవ్వాల నియో కేర్ హెల్పింగ్ హ్యాండ్స్ లో చిన్నారులకు దీపావళి టపాకాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం రాష్ర్ట అద్యక్షుడు నగునూరి రాజేందర్ మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాల నుండి ప్రతి పండుగ అనాథ చిన్నారులతో చేసుకోవడం జరుగుతుందన్నారు. అనాథ చిన్నారులకు ఎవరూ లేరు అనే లోటు తీర్చడానికే ప్రతి పండుగ చిన్నారులతో అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు.
అందులో భాగంగానే ఈరోజు చిన్నారులకు దీపావళి టపాకాయలు ఇవ్వడం జరిగింది అని తెలిపారు.చిన్నారుల ముఖములో చిరునవ్వు చిందించడం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఇకముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలియజేశారు.. కార్యక్రమంలో రేగురి మారుతి, శ్రీకాంత్ పాల్గొన్నారు.