Friday, November 22, 2024

త్వరలో గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్ల పంపిణీ : డాక్టర్ లలితా దేవి

చల్ పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ కె.లలితా దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అన్ని గదులను, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి తగు సూచనలు చేశారు. ప్రతి ఆరోగ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు త్వరలో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. వీటి కొరకు వీటిని భద్రపరిచే గదిని, అందుకు కావలసిన సౌకర్యాలను పరిశీలించారు. సిబ్బందిని వారు అమలు చేసే ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతీ గర్భిణీ స్త్రీని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశీలించి సాధారణ ప్రసవాలు జరిపించాలని చెప్పారు. సిబ్బంది పని వేళలు పాటించాలని, డివిజన్ లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యారోగ్య సిబ్బంది పని వేళలను పాటించి, అన్ని ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, ఎంపీహెచ్ ఈఓ వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్వైజర్ చలం, ఫార్మసిస్ట్ బాపన్న, ల్యాబ్ టెక్నీషియన్ చిన్న, స్టాఫ్ నర్స్ అరుణ, సాగర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement