Saturday, November 23, 2024

బీజేపీ కుట్రను నిరసిస్తూ ధర్నా.. ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం

పెద్దపల్లి : తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ పన్నిన కుట్రలను నిరసిస్తూ తెరాస పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్‌ చౌరస్తా వద్ద రాజీవ్‌ రహదారిపై ధర్నా చేపట్టిన అనంతరం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ దాసరి మమతరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బద్ధంగా తెరాస పార్టీ నుంచి ఎన్ని-కై-న నలుగురు ఎమ్మెల్యేలను ప్రజాస్వామ్య విరుద్దంగా కోట్లాది రూపాయలతో కొనుగోలు చేసేందుకు సిద్ధపడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రజల అభిమానం పొందలేకనే ఇలాంటి నీచ రాజకీయాలకు తెర తీస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కుట్రలను తెరాస ఎమ్మెల్యేలు తిప్పి కొట్టడం గర్వంగా ఉందన్నారు. ఇప్పటి-కై-నా బీజేపీ పార్టీ పద్ధతి మార్చుకోవాలని, రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్‌, తెరాస కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement