Saturday, November 23, 2024

చివరి గింజ వరకు కొనుగోలు..

కాల్వశ్రీరాంపూర్‌: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా చివరి గింజ వరకు పంట కొనుగోలు చేస్తుందని ఎంపీపీ నూనెటి సంపత్‌, జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్‌ చదువు రాంచంద్రారెడ్డిలు పేర్కొన్నారు. మండలంలోని శ్రీరాంపూర్‌ సహకార సంఘం ఆధ్వర్యంలో తారుపల్లి, మల్యాల, మొట్లపల్లి, చిన్నరాతిపల్లి, లక్ష్మీపురం, పందిల్ల, పెద్దరాతుపల్లి, మీర్జంపేట గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను, ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని గంగారంలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం సీఎం కేసీఆర్‌దేనన్నారు. ఎమ్మెల్యే దాసరి ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకు వచ్చి మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందని, కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. కేంద్రాల్లో కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరి పాటించాలన్నారు. ఈకార్యక్రమంలో సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ కామిడి సంధ్య వెంకట్‌రెడ్డి, ఏపీఎం సంగ సదానందం, సర్పంచులు బైరం రమేష్‌, పుప్పాల నాగార్జునరావు, కొంకటి మల్లారెడ్డి, గోనే శ్యామ్‌, ఓరుగంటి కొమురయ్య గౌడ్‌, దాసరి నవ లోక, లంక రాజేశ్వరి సదయ్య, దాసరి లావణ్య రమేష్‌, బండ రవీందర్‌ రెడ్డి, ఎంపీటీ-సీలు రావి సదానందం, గడ్డం రామచంద్రం, కదురు మానస సతీష్‌, సింగిల్విండో డైరెక్టర్లు గాజనవేన సదయ్య, ముస్కు శ్రీనివాస్‌, మ్యాదరి సదయ్య, రేవెళ్ళి చంద్రయ్య, ముస్కు తిరుపతి, సీఈఓ కొల్లేటి శ్రీనివాస్‌, పర్యవేక్షణాధికారి శ్రీనివాస్‌, కేంద్రాల నిర్వాహకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement