పెద్దపల్లి : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. సోమవారం కాల్వశ్రీరాంపూర్ మండలం లక్ష్మీ పురం రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయితీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టర్లు నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి,రైతు బంధు మండలాధ్యక్షుడు నిదానపురం దేవయ్య, ఛైర్మెన్ చదువు రామచంద్రారెడ్డి, మాజీ ఛైర్మెన్ రామచంద్రారెడ్డి,సర్పంచ్ బండ రవీందర్ రెడ్డి,ఎంపీటీసీ సదానందం,ఉప సర్పంచ్ చందర్, బండ మల్లారెడ్డి,సంజీవ రెడ్డి, లింగయ్య,గ్రామ పాలకవర్గం, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement