Friday, November 22, 2024

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి కొప్పుల ఈశ్వర్

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కోపులి ఈశ్వర్ పేర్కొన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పీడబ్ల్యూడీ రోడ్ నుండి కోటిలింగాల మీదుగా పాశిగామ వరకు 1 కోటి 50 లక్షల రూపాయలు నిధులతో నిర్మించ తలపెట్టిన బీటి రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టర్లతో పాటు ఇతర ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement