రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరిపోసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్ లోని మానేరు జలాశయంలో మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కమార్, జడ్పీ చైర్ పర్సన్ కనుమల విజయ, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, సుడా చైర్మన్ జి. నీ రామకృష్ణారావు, చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్య సంపదను పెంచేందుకు మానేరు డ్యాంలో చేప పిల్లలను వదలడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధికి ఎంతో కృషిచేస్తున్నదన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement