Friday, November 22, 2024

KNR: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. మేయర్

ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెల్లే విధంగా ప్రచార కార్యక్రమాలను రూపొందించాలని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పార్టీ ముఖ్య నాయకులకు సూచించారు. మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు శుక్రవారం కరీంనగర్ లోని మంత్రి మీసేవ కార్యాలయంలో కరీంనగర్ నగరం, కొత్తపల్లి మండలాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం జరిగింది. మేయర్ యాదగిరి సునీల్ రావు అద్యక్షతన, బీఆర్ఎస్ పార్టీ నగర అద్యక్షులు చల్ల హరిశంకర్ సమక్షంలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఎన్నికల ప్రచార కార్యక్రమాల నిర్వహాకులు పై పార్టీ సుధీర్ఘంగా చర్చించారు.

సమావేశంలో వారి సలహాలు, సూచనలను స్వీకరించి… బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో చేయబోయే ప్రచార కార్యక్రమాల రూపకల్పన పై సమావేశంలో చర్చించి… తగిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సంధర్బంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గులాబీ దళం కలిసికట్టుగా పని చేసి మల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. 4వ సారి మంత్రి గంగుల కమలాకర్ ను మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో గెలిపించి అసెబ్లీకి పంపేలా చర్చించినట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు గులాబీ దళం సిద్దమైనట్లు తెలిపారు.

ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు దోహద పడుతాయన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల దీవెనలతో మంత్రి గంగుల కమలాకర్ ను 4వ సారి బారీ మెజారిటీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు. ముఖ్య నాయకుల సమావేశంలో, కరీంనగర్ నగరం, కొత్తపల్లి మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్యాం సుందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, గ్రంథాలయం చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, ఎంపీపీలు పిల్లి శ్రీలత మహేష్, లక్ష్మయ్య, పార్టీ సీనియర్ నాయకులు జమీల్ హైమద్, వాసాల రమేష్, పార్టీ ముఖ్య నాయకులు సర్వర్, సాజీద్ పాషా, జువ్వాడి రాజేశ్వర్ రావు, సంపత్ రావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement