కమీషన్ల కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు పనులలో జాప్యం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. గంభీరావుపేట మండలం సింగసముద్రం చెరువు వద్ద నైన్త్ ప్యాకేజీ పనులు పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఎమ్మార్ కేఆర్ కంపెనీ యజమానులు కడప జిల్లా వారు కాబట్టి ఇక్కడి ప్రాంత ప్రజల పైన, పనులు పూర్తి చేయడానికి శ్రద్ధ చూపించడం లేదన్నారు. మళ్లీ కొత్తగా టెండర్లు వేసి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉందన్నారు. మంత్రి కేటీఆర్ కు వేలకోట్ల ఆస్తులు సంపాదించుకోవడమే తప్ప ప్రజల మీద కనీస ప్రేమ లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరనే సాగునీటి ప్రాజెక్టు శాఖ ఉంచుకొని ప్రాజెక్టు తొమ్మిదవ ప్యాకేజీ పనులు పూర్తి చేయకపోవడంపై ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. కాలేశ్వరం ప్రాజెక్టు ఆయా ప్యాకేజీల పనులు పూర్తి అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సాగునీటి శాఖ ఈఎన్సి, సీఈ ఆయా అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామన్నారు. ఆంధ్ర పాలకుల వివక్షతో తెలంగాణలో ప్రాజెక్టులు అన్యాక్రాంతమైనవి అని కేసీఆర్ గతంలో చెప్పారన్నారు.. సీఎం కేసీఆర్ నాడు చెప్పిన మాట మేరకే నేడు ఆంధ్ర గుత్తేదారులు తెలంగాణలో ప్రాజెక్టులు చేయడంలో అలసత్వం వహిస్తున్నారన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement