Saturday, November 23, 2024

అప్పుల బాధ తాళలేక యువకుడి ఆత్మహత్య

అప్పుల బాధ తట్టుకోలేక సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో చోటు చేసుకుంది. సూసైడ్ నోట్ లో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి అన్నారం గ్రామానికి చెందిన ముద్రకోల రామాంజనేయులు గ్రామంలో అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తుంటాడు. అతని వద్ద ఇదే గ్రామానికి చెందిన మార్క ప్రశాంత్ (26) వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు. రామాంజనేయులు ఇచ్చిన డబ్బులకు 10% నుండి 15% వడ్డీ వసూలు చేశాడని, రూ.10 లక్షలు చెల్లించినప్పటికీ ఇంకా రూ.20 లక్షల అప్పు కట్టాలని అప్పు ఉన్న డబ్బులు ఎవ్వరికి తెలియకుండా తెచ్చి ఇవ్వాలని బెదిరింపులకు గురి చేశాడని సూసైడ్ నోట్లో మార్క ప్రశాంత్ పేర్కొన్నాడు.. ప్రశాంత్ తండ్రి మార్క ఆంజనేయులు తన కొడుకు మృతికి కారణమైన ముద్ర కోల రామాంజనేయులు పై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement