Tuesday, November 26, 2024

క‌రీంన‌గ‌ర్ అర్చ‌కుల ఆధ్వ‌ర్యంలో ద‌శావ‌తార ఆల‌య ప్ర‌తిష్టా మ‌హోత్స‌వం

కాకినాడలో కరీంనగర్ అర్చక బృందం చేత దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవం జరిగింది.
కాకినాడ రూరల్ చీడిగలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో నూతనంగా రెండు కోట్ల వ్యయంతో తొమ్మిది ఫీట్ల ఎత్తుతో దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వ‌హిస్తున్నారు. దీనిని కరీంనగర్ వాస్తవ్యులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త్ర పండితులు.. శతాధిక ప్రతిష్ఠాపనాచార్య బిరుదాంకితులైన నమిలకొండ రమణాచార్య ఆధ్వర్యంలో మాజీ మంత్రి వర్యులు కన్నబాబు నిర్వహణలో 30 వరకు జరుగుతుంది. ఆలయ కమిటీ సభ్యులు మొదటి నుండి రమణాచార్యనే సంప్రదించి భారీ నిర్మాణం చేయడం స్వామిజీది 140వ ప్రతిష్ట కావడం కరీంనగర్ జిల్లాకే గర్వకారణంగా ఉందని విశ్వహిందూ పరిషత్ వారు తెలియచేశారు. కరీంనగర్ నుండి కొదుమగుళ్ళ వెంకటరమణ.. రామక్రిష్ణ.. చిట్యాల భరత్.. తిరువరంగం భరత్.. శేషం నవీనాచార్యులు మొదలగు పండితులు కరీంనగర్ నుండి వెళ్ళారు. రమణాచార్యులు వారి శాస్త్ర విధానాన్ని చూసి అక్కడి కమిటీ సభ్యులు ఆనందం వ్వక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement