పెద్దపల్లిరూరల్: వేసవికాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో దోహదపడతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో పట్టణంలోని కునారం రోడ్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఇలాగే సేవా కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాం క్షించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతరెడ్డి, కమిషనర్ తిరుపతి, అధ్యక్షులు డాక్టర్ అశోక్‌కుమార్, ప్రతినిధులు వంశీరాజ్, సంపత్‌రావు, బాబురావు, జైపాల్ రెడ్డి, వెంకట్, బత్తుల రమేష్, ఆనంద్, అల్లంకి శ్రీనివాస్, శ్రీనివాస్, టి. శ్రీనివాస్, సభ్యులు సతీష్‌రెడ్డి, శ్రీధర్, అనిల్‌చారి, కొండపాక శ్రీనివాసాచారి, రమేష్, లక్ష్మణ్, వార్డు కౌన్సిలర్ భిక్షపతి, శ్రీధర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల దాహార్తిని తీర్చే చలివేంద్రాలు- పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి
Advertisement
తాజా వార్తలు
Advertisement