కాల్వశ్రీరాంపూర్: గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ప్రజలు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని పెగడపల్లి గ్రామంలో పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు -చేసిన హైపోక్లోరైట్ ద్రావణం పిచికారిని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలపై స్పందించాలని సూచించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో పంచాయతీ పాలకవర్గాలు తగు చర్యలు తీసుకోవాలని, అప్పటికప్పుడు వీధులను శుభ్రం చేస్తూ, మందును పిచికారి చేయాలన్నారు. తప్పనిసరైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రాకూడదు అని వచ్చిన మాస్కులు ధరించాలని, శాని-టైజర్ వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆరెల్లి సుజాత రమేష్, ఎంపీటీ-సీ సుముఖం నిర్మల మల్లారెడ్డి, ఉపసర్పంచ్ జంగా సుఖేందర్‌రెడ్డి, ఎంపీపీ నూనెటి సంపత్, జడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి, నాయకులు గొడుగు రాజ కొమురయ్య, ఈర్ల శ్రీనివాస్, జంగా శ్రీనివాస్ రెడ్డి, నూనెటి కుమార్, జంగా రమణారెడ్డి, కూకట్ల నవీన్, రాజు, సదయ్య, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement