కాల్వ శ్రీరాంపూర్, నవంబర్ 24 (ప్రభ న్యూస్): సమైక్య రాష్ట్రంలో కారు చీకట్లు కమ్ముకున్న కాంగ్రెస్ కావాలా.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తెలంగాణలో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలా.. ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పెద్దపల్లి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కోరారు. ఇవాళ కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం, పెగడపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ… 50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ అవినీతి, అక్రమాలకు పాల్పడడమే తప్ప ఏనాడు కూడా పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి మరోసారి ఆగం కావొద్దని, సంక్షేమ ప్రభుత్వాన్ని ఆదరించాలన్నారు.
సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే మోసపూరిత మాటలు నమ్మి ఓటేస్తే మళ్లీ నష్టపోతామన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తిరిగి బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే రూ.400కే సిలిండర్, రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ, రైతుబంధు, ఆసరా పింఛన్ దశలవారీగా పెంచుతామన్నారు. గ్రామాల్లోకి వచ్చిన ఎమ్మెల్యే దాసరికి మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ పార్టీలో చేరగా, గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్‌లు గజవెళ్లి పురుషోత్తం, చదువు చంద్రారెడ్డి, ఎంపీటీసీలు పుల్లూరి రామ రాజమల్లు, నిర్మల మల్లారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గొడుగు రాజా కొమురయ్య, నాయకులు జిన్నా రామచంద్ర రెడ్డి, నిదానపురం దేవయ్య, కోట్టే రవి, సమ్మయ్య, నూనేటి కుమార్, జంగ రమణారెడ్డి సతీష్, శ్రీనివాస్ తిరుపతి, నవీన్ యాదవ్, కుంభం రాజు, తిరుపతిలు పాల్గొన్నారు.