Friday, November 22, 2024

దళిత బిడ్డల్లో వెలుగులు నింపుతున్న దళిత బంధు

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ‘దళితబంధు’ ఏండ్ల నాటి దారిద్రాన్ని దూరం చేస్తున్నది. ఏండ్లకేండ్లుగా దగా పడ్డ దళిత బతుకులకు భరోసా
ఇస్తున్నది. యూనిట్ల గ్రౌండింగ్ వేగంగా సాగుతుండగా, అంతటా సంబురం అంబరాన్నంటుతున్నది. తాజాగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో 24 మంది దళితబంధు లబ్ధిదారులకు రూ.2.80 కోట్ల విలువైన ఆరు హార్వెస్టర్లు, మూడు ఎక్కవేటర్లు, డీసీఎం వ్యాన్‌ను మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేయగా, లబ్ధిదారులు ఆనందంలో మునిగితేలారు. కుటుంబ సమేతంగా వచ్చి కేటాయించిన వాహనాలను తీసుకెళ్లారు. కొందరు స్వయంగా నడుపుకుంటూ నవ్వులు చిందిస్తూ మురిపెంగా ఇండ్లకు వెళ్లారు. మంత్రి గంగుల సైతం లబ్ధిదారులను ఆప్యాయంగా పలుకరిస్తూ యూనిట్లను అందించారు. పలువురితో సరదాగా ముచ్చటించారు. కుశల ప్రశ్నలు వేశారు. అమ్మా బాగున్నారా..? బ్రదర్ ఏం సంగతి.. వెహికిల్ మంచిగున్నదా ? అంటూ అడిగారు. దశాబ్దాల కాలంగా పేదరికంలో మునిగి పోయిన దళితుల జీవితాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు వెలుగులు నింపింది. ఇంత కాలం డ్రైవర్లుగా పనిచేసిన వారే ఓనర్లుగా మారేలా చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement