రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి రుద్రాభిషేకం, అన్నపూజ, బాలాత్రిపురా సుందరీదేవి ఆలయంలో కుంకుమపూజ, కళాభవన్‌లో స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం తదితర ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. తలనీలాలు సమర్పించే భక్తులతో ఆలయ కల్యాణకట్ట రద్దీగా మారింది. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయం బోనాలు సమర్పించే భక్తులతో రద్దీగా మారింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement