ఓవర్ లోడ్‌తో వెళ్తున్న కర్ర లారీలపై పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు కొరఢా ఝుళిపించారు. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఓవర్ లోడ్ తో వెళ్తున్న 20 కర్ర లారీలను ఆపి వేశారు. ఈసందర్బంగా సీఐ మాట్లాడుతూ లారీలు ఓవర్ లోడ్, అతి వేగంగా వెళ్లడం వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. లారీకి బయటకు వచ్చేలా కర్రలు ఉంటే విద్యుత్ తీగలకు తగిలి షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగే అవకాశాలున్నాయన్నారు. అలాగే ఓవర్ లొడ్‌తో డ్రైవర్స్‌కి లారీ బ్యాలెన్స్ చేయడం కూడా కష్టతరమవుతుందన్నారు.
ఇలాంటి లారీలు రోడ్లపై నిలిచిపోయిన సమయంలో ట్రాఫిక్‌కు కూడా అంతరాయం కలుగుతుందన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఓవర్ లోడ్‌తో వెళ్లిన లారీలను సీజ్ చేయడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.