ఆకస్మిక గుండెపోట్లతో సంభవిస్తున్న మరణాలను సీపీఆర్ (హృదయ శ్వాసకోశ పురర్జీవనచర్య)తో నియంత్రించవచ్చని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆవరణలో సిబ్బందికి సీపీఆర్ విధానంపై శిక్షణ ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. ఆకస్మిక గుండెపోట్ల నుండి ప్రజలను రక్షించేందుకు శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. ఆకస్మిక గుండెపోట్లు సంభవించిన సందర్భాల్లో సీపీఆర్ విధానం ద్వారా గుండెకు రక్తప్రసరణం అందడం, నోటి ద్వారా ఆక్సిజన్ అందించడం వల్ల గుండె పనిచేయడం ప్రారంభించి ప్రమాదానికి గురైనవారిని రక్షించవచ్చని తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉండే పోలీసులకు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలను వారికి ఆకస్మిక గుండెపోట్లు సంభవించిన వ్యక్తులు తారసపడే అవకాశం ఉన్నందున, అన్నిస్థాయిలకు చెందిన సిబ్బంది పూర్తిస్థాయిలో శిక్షణ పొందినట్లయితే అలాంటి వ్యక్తుల ప్రాణాలను రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, మహిళా కమిషన్ సభ్యురాలు రేవతి రావు తో పాటు పలువురు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement