Thursday, November 21, 2024

పోలీస్ అమరులను స్మరిస్తూ సైకిల్ ర్యాలీ.. పాల్గొన్న సీపీ సత్యనారాయణ

పోలీసు అమరవీరులను స్మరిస్తూ కరీంనగర్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సైకిల్ ర్యాలీకి విశేష స్పందన లభించింది. పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. గీతా భవన్ చౌరస్తా నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ మంకమ్మ తోట – లేబర్ అడ్డా – శివ టాకీస్ చౌరస్తా – స్పెన్సర్స్ – ఏస్ అర్ అర్ కాలేజీ – కోర్టు చౌరస్తా – మంచిర్యాల చౌరస్తా – గాంధీ రోడ్ – రాజీవ్ చౌక్ – తెలంగాణ అమరవీరుల స్తూపం – తెలంగాణ తల్లి విగ్రహం – కమాన్ చౌరస్తా – బస్టాండ్ ల మీదుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకుంది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో శాంతి స్థాపన కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసు అమరవీరుల ఆశయాల సాధన కోసం అంకిత భావంతో కృషి చేస్తున్నామన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు సమాజం శాంతియుతగా వర్ధిల్లుతున్నదన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వివిధ రకాల కార్యక్రమాల్లో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాల్గొంటున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తమ వంతు సహకారం అందిస్తూ పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (పరిపాలన) చంద్రమోహన్, ఏసిపిలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, సి ప్రతాప్, జె విజయసారథి, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్లు సిహెచ్ నటేష్, టి లక్ష్మిబాబు, దామోదర్ రెడ్డి, బి శ్రీనివాస్, తిరుమల్ గౌడ్, రాంచందర్ రావు, రవీందర్, సృజన్ రెడ్డి, శ్రీనివాస్, ఆర్ఐలు కిరణ్ కుమార్, టి మురళి, రమేష్, జానీ మియా లతో పాటు వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు, సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులతో పాటుగా 500 మంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement