ఓదెల: కోవిడ్ నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ రెవెన్యూ శాఖకు బాధ్యతల అప్పగించారు. ఓదెల తాసిల్దార్ రామ్మోహన్ తన సిబ్బందితో కలిసి మండలంలో పర్యటించారు. ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఉద్యోగుల పట్టిక తీరును పరిశీలించి కేసుల పూర్వాపరాలు వ్యాక్సిన్ ల వివరాలు పరిశీలించారు. విచ్చలవిడిగా కేసులు పెరుగుతున్న సందర్భంలో జిల్లా కలెక్టర్ ప్రతి గ్రామానికి విఆర్వోలను బాధ్యతలు అప్పగించి ఆరోగ్య సిబ్బందితో కలిసి కరోనా నియంత్రణకు కృషి చేయాలని ఆదేశించారన్నారు. టెస్టులు పెంచాలని, వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కొలనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తహసిల్దార్ రామ్మోహన్ సందర్శించి అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement