ఓదెల: 45 ఏళ్ల పైబడిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ వేయించేందుకు గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది, ఉద్యోగులు నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం నుండి ఒత్తిడి పెరగడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో పని చేస్తున్న ఆరోగ్య సిబ్బందితో పాటు గ్రామస్థాయి అధికారులు వ్యాక్సిన్ టీకాలు తీసుకునే వారి కోసం ఇళ్లకు వెళ్లి బతిమిలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యం గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది కోవిడ్ పరీక్షలు చేసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకోవాలని అవగాహన కల్పిస్తూ దగ్గరుండి వాహనాల్లో కేంద్రాలకు తరలిస్తున్నారు. దీంతో ఆరోగ్య కేంద్రాలు ప్రజలతో నిండిపోతున్నాయి. ఆశ కార్యకర్తలు కరోనా నివారణ కోసం పూర్తిస్థాయిలో సేవలందిస్తున్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ కోసం వాహనాల్లో తరలింపు..
By sree nivas
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement