పెద్దపల్లి: పెద్దపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతరెడ్డి అధ్యక్షతన ప్రత్యేక బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘాల చట్టాల ప్రకారం 2021-22 సంవత్సర చిత్తు అంచనా ఆదాయ వ్యయాలు, 2020-21 సంవత్సర సవరణ అంచనా ఆదాయ వ్యయాలకు సంబంధించి బడ్జెట్ కౌన్సిల్ ఆమోదం మేరకు అంచనాలను సిద్ధం చేసినట్లు చైర్ పర్సన్ మమతరెడ్డి తెలిపారు. 2020-21 సంవత్సరంలో సవర ణ అంచనా ఆదాయ వ్యయాలలో 2020 ఏప్రిల్ 1 ప్రారంభ నిల్వ రూ. 61.71లక్షలు ఉండగా, 2020-21 సంవత్సర సాధారణ నిధుల అంచనా ఆదాయం రూ. 898.62లక్షలతో మొత్‌ం రూ. 960.33లక్షలు ఉందన్నారు. అలాగే 2020-21 సంవత్సరపు సాధారణ నిధుల అంచనా వ్యయం రూ. 841.65లక్షలు, 2021 మార్చి 31కి వ్యయంపై ఆదాయం అంచనా మిగులు రూ. 118.68లక్షలు ఉందన్నారు. అలాగే 2021-22 సంవత్సరపు అంచనా వ్యయాలలో 2021 ఏప్రిల్ 1 ప్రారంభం నిల్వ రూ. 118.68లక్షలు, 2021-22 సంవత్సరపు సాధారణ నిధుల అంచనా ఆదాయం రూ. 1001.40లక్షలు, 2021-22 సంవత్సరపు ప్లాన్, నాన్ ప్లాన్ గ్రాంట్స్ అంచనా ఆదాయం రూ. 4295.00 లక్షలతో మొత్తం అంచనా ఆదాయం రూ. 5415.08లక్షలుగా ఉందన్నారు. 2021-22 సంవత్సరపు సాధారణ నిధుల అంచనా వ్యయం రూ. 1116.76లక్షలు, 2021-22 సంవత్సరపు ప్లాన్, నాన్ ప్లాన్ గ్రాంట్స్ అంచనా రూ. 4295.00లక్షలతో మొత్తం అంచనా వ్యయం రూ. 5411.76లక్షలు ఉందన్నారు. 2022 మార్చి 31 నాటికి అంచనా వ్యయంపై అంచనా దాయం మిగులు రూ. 3.32లక్షలు, 2021-22 అంచనా బడ్జెట్ మొత్తం రూ. 5415.08లక్షలుగా ఉందని వివరించారు. ఈ సమావేశంలో కమిషనర్ తిరుపి, వైస్ చైర్ పర్సన్ నజ్మీన్ సుల్తానా ముబీన్, మేనేజర్ నయీమ్ షా ఖాద్రి, ఆర్‌ఐ శివప్రస్‌ా, ఎంఏఈ సతీష్, సీనియర్ అకౌంటెంట్ సంతోష, కౌన్సిలర్లు, కో- ఆప్షన్ సభ్యులతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement