Friday, November 22, 2024

మెగా వైద్య శిబిరంతో కార్పోరేట్‌ వైద్యం : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి : పేద ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలొని ట్రీ-నిటీ- ప్రైమరీ స్కూల్‌లో ఎమ్మెల్యే దాసరి ఆధ్వర్యంలో సన్‌ షైన్‌ హాస్పిటల్‌ కరీంనగర్‌ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శిబిరాన్ని సందర్శించిన అనంతరం ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ పేద ప్రజలకు ఇలాంటి మెగా వైద్య శిబిరాల ద్వారా కార్పోరేట్‌ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరూ ఉచిత మెగా హెల్త్‌ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రజల కోసం పలు విభాగాలకు సంబంధించిన వైద్యులను ఈ శిబిరంలో అందుబాటులో ఉంచామన్నారు. ప్రైవేట్‌ దవాఖానాకు వెళ్లి వేలు ఖర్చు చేసుకోకుండా ఉచితంగా -టె-స్టులు చేయించుకొని తగిన మందులు పొందాలని కోరారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ నజ్మీన్‌ సుల్తానా, కౌన్సిలర్‌లు లైసెట్టి భిక్షపతి, పూదరి చంద్రశేఖర్‌, నాయకులు పెంచాల శ్రీధర్‌, డాక్టర్‌ అజీజ్‌, ఉప్పు రాజు, వెన్నం రవీందర్‌, కో ఆప్షన్‌ సభ్యులు, రామ్మోహన్‌, డాక్టర్‌లు సురేష్‌ కుమార్‌, శ్రీకాంత్‌, మైథిలి, శ్రీనిధి, గ్రీష్మ, కమలాకర్‌, వినోద్‌ కుమార్‌, రాజేందర్‌, బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement