Thursday, November 21, 2024

గురుకులాల్లో కార్పొరేట్ స్థాయి విద్య : ప్రభుత్వ విప్ బాల్క సుమన్

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకులాల్లో తమ ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసన సభ్యులు బాల్క సుమన్ పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విద్యార్థినిలతో స్వయంగా మాట్లాడి పాఠశాలలో సౌకర్యాలతో పాటు విద్యా సౌకర్యాలు భోజనం పట్ల ఆరా తీశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తుందన్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. తరగతి గదులను పరిశీలించడం తోపాటు విద్యార్థుల తయారుచేసిన భోజనాన్ని పరిశీలించడంతోపాటు వారితో కలిసి భోజనం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement