Saturday, November 23, 2024

కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి..

ఇల్లంతకుంట: కరోనా వాక్సినేషన్‌ను తప్పకుండా తీసుకోవాలని, అపోహాలు వద్దని ప్రాథమిక ఆరోగ్యవైద్యాధికారి రామకృష్ణ అన్నారు. మండలంలోని గాలిపల్లి ఆరోగ్య ఉపకేంద్రంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ శిబిరాన్ని నిర్వహించారు. గాలిపల్లిలో గత వారం రోజులుగా రోజు రోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఉదయం 8 గంటల నుండే గ్రామస్థులు టీకా వేసుకునేందుకు బారులుతీరారు. దాదాపు 250 మంది 45 ఏళ్ల వయస్సు పైబడిన వారు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎలాంటి అపోహలు పోవద్దని, టీకాఅందరూ వేసుకోవాలనికోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మల్లుగారి వాణి దేవేందర్‌ రెడ్డి, ఎంపీటీసీ సింగిరెడ్డి శ్యామలదేవి సుధాకర్‌రెడ్డి, ఏఎన్‌ఎంలు బీఆర్‌ సులోచన, సుమతీ, ఆశా కార్యకర్తలు డి. సరిత, భారతి, లక్ష్మిలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement