ఎల్లారెడ్డిపేట: మండలంలో తీవ్ర మవుతున్న కరోనా వలన ప్రజలు కలవర పడుతూ కరోనా వ్యాక్సిన్ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45 ఏళ్ళు, 60 ఏళ్లపై బడిన వారు క్యూ కట్టారు. కరోనా బారి నుండి రక్షించుకోవడానికి 60 ఏళ్లపై బడిన వృద్దులు, 45 ఏళ్ల పైబడిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్‌రావు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులను ప్రజలకు భయం లేకుండా వ్యాక్సిన్ తీసుకొనేలా అవగాహన కల్పించాలని కోరారు. దీంతో మండల వైద్యాధికారులు ధర్మానాయక్, మానసలు గ్రామాలలో అర్హులైన వారందరు వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. దీంతో మండలంలోని అన్ని గ్రామాలలోని 60 ఏళ్ళు, 45 ఏళ్ల పై బడిన వ్యక్తులు, నాయకులు, వ్యాపారులు, ఉద్యోగులు కరోనా టీ కా తీసుకునేందుకు ఆరోగ్య కేంద్రానికి తరలివెళ్తున్నారు. రోజు 200 మందికి కరోనా టీ కాలు వేస్తున్నట్లు, అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వైద్యాధికారి ధర్మ నాయక్ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement