ముత్తారం: కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా మండలంలోని కేశన్పల్లి గ్రామంలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే ఓడేడ్ గ్రామంలో మంథని సీఐ మహేందర్రెడ్డి, ముత్తారం ఎస్ఐ నర్సింహరావు ఆదేశాల మేరకు సర్పంచ్ సిరికొండ బక్కారావు ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రజలు ప్రభుత్వ నిబంధనలు పాటించి కరోనాను పారదోలాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ భానుకుమార్, వార్డుసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement